పల్లవి:
అన్ని నామముల కన్న పై నామము - యేసుని నామము    
ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామమూ    
యేసు నామము - జయం జయమూ    
సాతాను శక్తుల్ - లయం లయమూ     (2X)
హల్లేలూయ హోసన్న - హల్లేలూయ    
హల్లేలూయ - ఆమేన్     (2X)
 
1.
పాపములనుండి విడిపించును - యేసుని నామము     (2X)
నిత్య నరకాగ్నిలోనుండి రక్షించును - క్రీస్తేసు నామము     (2X)
...యేసు నామము...
 
2.
సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన - యేసు నామము     (2X)
శత్రు సమూహము పై జయము నిచ్చును - జయశీలుడైన యేసుని నామము     (2X)
...యేసు నామము...
 
3.
రోగములనుండి విడిపించును - యేసుని నామము     (2X)
సమస్త బాధలను తొలగించును - శక్తిగల యేసు నామము     (2X)
...యేసు నామము...