1.
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి - ఆ ప్రభుండు    
బెత్లెహేము నందునన్ - భూజనంబు కెల్లను    
సౌఖ్య సంభ్రమాయెను - ఆకసంబు నందున మ్రోగు పాట    
చాటుడి - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి    
 
2.
ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శద్దులు - అంత్య కాలమందున కన్య    
గర్భమందున - బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానియేల్ ప్రభో - ఓ నరవతారుడా    
నిన్ను నెన్న శక్యమా? - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి    
 
3.
రావె నీతి సూర్యడా రావె దేవపుత్రుడా - నీదు రాకవల్లను లోక    
సౌఖ్యమాయెను - భూనివాసులందరు మృత్యుభీతి గెల్తురు - నిన్ను నమ్ము    
వారికి ఆత్మశుద్ది కల్గును - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి