పల్లవి:
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా    
అందుకో నా దీన స్తుతిపాత్ర - హల్లెలూయ యేసయ్యా    
 
1.
నా పాపము బాప - నరరూపివైనావు - నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి     (2x)
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్తానములో నీవే     (2x)
...ఎందుకో...
 
2.
నీ రూపము నాలో - నిర్మించి యున్నావు - నీ పోలికలోనె - నివసించున్నావు     (2X)
నీవు నన్ను ఎన్నుకొన్నావు - నీ కొరకై కృపలో     (2X)
...ఎందుకో...
 
3.
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు - నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు     (2X)
...ఎందుకో...
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం - నీకేమి చెల్లింతున్     (2X)
...ఎందుకో...