పల్లవి:
గొప్పా దేవుడవని శక్తి సంపన్నుడని - గలమెత్తి నిన్ను నేను గాణమాడెదన్    
రాజుల రాజువని రక్షణ దుర్గమని - నీ కీర్తిని నేను కొనియాడెదన్    
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ     (2X)
 
1.
అద్భుత క్రియలు చేయువాడని - ఆశ్చర్యకార్యములు చేయగలవని    
అద్వితీయుడవని ఆది సంభూతుడని - ఆరాధించెద నిత్యము నిన్ను    
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ    
...గొప్పా...
 
2.
సాగరాన్ని రెండుగా చేసినాడని - సాతాను శక్తులను కూల్చినావని    
సర్వోతున్నవడని సర్వసంపన్నుడని - సాక్ష్యగీతము నే పాడెదన్    
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ    
...గొప్పా...