పల్లవి:
క్రీస్తులో జీవించు నాకు - ఎల్లాప్పుడు జయముండును     (2X)
జయముంది - జయముంది - జయముంది - నాకు     (2X)
 
1.
ఎటువంటి శ్రమలొచ్చిన - నేను దిగులుపడను ఇలలో     (2X)
ఎవరేమి చేసిననూ - నేను సోలిపోనెప్పుడు     (2X)
...క్రీస్తులో...
 
2.
నా రాజు ముందున్నాడు - జయముతొ వెళ్లుచున్నాడు     (2X)
మట్టలను చేతబట్టి - నేను హోసన్న పాడెదను     (2X)
...క్రీస్తులో...
 
3.
సాతాను అధికారమున్ - నా రాజు తీసివేసెను     (2X)
సిలువలొ దిగగొట్టి - యేసు కాళ్ళతొ త్రొక్కివేసెన్     (2X)
...క్రీస్తులో...