పల్లవి:
కృపామయుడా - నీలోనా - నివసింప జేసినందునా     (2X)
యివిగో నా స్తుతుల సింహాసనం - నీలో నివసింప జేసినందునా    
...కృపామయుడా..ఆ..
 
1.
ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక     (2X)
నా మార్గములన్నిటిలొ.. - నీవె ఆశ్రయమైయుండగా     (2X)
...కృపామయుడా..ఆ..
 
2.
చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా     (2X)
రాజవంశములో.. - యాజకత్వము చేసేదను     (2X)
...కృపామయుడా..ఆ..
 
3.
నీలో నిలచి ఆత్మఫలములు ఫలియించుట కొరకే     (2X)
నాపైనా నిండుగా.. ఆత్మవర్షము క్రుమ్మరించు     (2X)
...కృపామయుడా..ఆ..
 
4.
ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీటమిచ్చుటకు     (2X)
నీ కృప ననువీడకా.. - శాశ్వత కృపగా మారెను     (2X)
...కృపామయుడా..ఆ..