పల్లవి:
నీలాకాశంలోన నింగికెగసె తార     (2X)
ఆ తార వెలుగు గమనమం బాల యేసు జననం    
ఆనందం ఆనందం అరుణోదయానందం    
నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం    
 
1.
ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్బాన మెరిసిన కాంతుల్     (2X)
సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితొ స్తంభించిన రోజు    
...నీలాకాశంలోన...
 
2.
గొల్లలు జ్ఞానులు సంభ్రముతొ తపియించిరి వరపుత్రుని బొసి నవ్వులన్     (2X)
నీ కృపాసనంబు నొద్ద దుఃఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా    
...నీలాకాశంలోన...