పల్లవి:
పరమా జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండ    
నిరంతరము నను నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును    
యేసు చాలును - యేసు చాలును - ఏ సమయమైనా    
ఏ స్తితికైనా - నా జీవితములొ - యేసు చా లు ను    
 
1.
సాతాను శోధన లదికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను     (2X)
లోకము శరీరము లాగిననూ - లోబడక నేను వెళ్ళెదను     (2X)
...యేసు చాలును...
 
2.
పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలముల చెంత నడిపించును     (2X)
అనిశము ప్రాణము తృప్తిపరచును - మరణ లోయలొ నన్ను కాపాడును     (2X)
...యేసు చాలును...
 
3.
నరులెల్లరు నను విడచినను - శరీరము కృళ్ళి కృశించినను     (2X)
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడచినను     (2X)
...యేసు చాలును...