పల్లవి:
పరమ పావనుడు మరియ తనయుడు అవతరంచెనే శుభ దినాన     (2X)
మది పరవశాన ఉప్పొంగగ పరవశాన ఉప్పొంగగ    
అందిచెదను ప్రేమ సందేశం అందిచెదను క్రిస్మస్ సందేశం    
...పరమ...
 
1.
దూత గణములెల్ల మదినాలపింపగ గొల్లలు స్తుతులను అర్పింపగ     (2X)
వినరండి బాల యేసుని దివ్యగాధను    
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును    
...పరమ...
 
2.
తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ     (2X)
అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ     (2X)
...పరమ...