పల్లవి:
రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు    
రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని    
...రుచి చూచి...
 
1.
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవె    
తప్పక ఆరాదింతు దయాళుడవు నీవే    
...రుచి చూచి...
 
2.
మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా    
మనసార పొగడెదను నీ ఆశ్చర్యకార్యములన్    
...రుచి చూచి...
 
3.
మంచి తనము గల దేవా ప్రభావము గలవాడా    
ముదమార పాడెద నిన్ను అతి సుందరుడవనియు    
...రుచి చూచి...
 
4.
ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలొ చేరి    
సంపూర్ణముగా పొందెదను అడుగువాటన్నిటికి    
...రుచి చూచి...