పల్లవి:
యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం    
పరిపూర్ణమైనది నీ మార్గం - యెహోవా...    
 
1.
నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను    
వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ    
...యెహోవా...
 
2.
మరణపుటురులలొ మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై    
తన ఆలయములొ నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే    
...యెహోవా...
 
3.
నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్    
జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ    
...యెహోవా...
 
4.
పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతముల పూనాదులు వణికెన్    
తన నోట నుండి వచ్చిన అగ్ని - దహించివేసెను వైరుల నెల్ల    
...యెహోవా...
 
5.
మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్    
ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని    
...యెహోవా...
 
6.
దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును    
గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాదికారి    
...యెహోవా...
 
7.
నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును - ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి    
రక్షణకేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన    
...యెహోవా...
 
8.
యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు    
అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద    
...యెహోవా...