పల్లవి:
యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగునూ     (2X)
 
1.
పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును    
శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును    
...యెహోవా...
 
2.
గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను    
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును    
...యెహోవా...
 
3.
నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి    
నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లు చున్నది    
...యెహోవా...
 
4.
నా బ్రతుకు దినంబులన్నియును - ని కృపాక్షేమాలే నా వెంట వచ్చును    
నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ నాశింతును    
...యెహోవా...