పల్లవి:
యేసు రాజు రాజుల రాజై - త్వరగా వచ్చుచుండె - త్వరగ    
వచ్చుచుండె - హోసన్నా జయమే (2x).. హోసన్నా జయం మనకే    
 
1.
యోర్ధాను ఎదురైన - ఎఱ్ఱసంద్రాలు - పొంగిపొర్లినా     (2x)
భయములేదు - జయము మనకే - విజయగీతము పాడెదము    
...హోసన్నా...
 
2.
శరీర రోగమైనా - అది ఆత్మీయ వ్యాధియైనా - యేసుగాయముల్     (2x)
స్వస్థపరచును - రక్తమే రక్షణనిచ్చున్    
...హోసన్నా...
 
3.
హల్లెలూయ స్తతి మహిమ ఎల్లప్పుడు - హల్లెలూయ స్తుతి మహిమ     (2x)
యేసురాజు మనకు ప్రభవై త్వరగ వచ్చుచుండె    
...హోసన్నా...